సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి రెండో పాట రిలీజ్

సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి రెండో పాట రిలీజ్

వెంకటేష్  హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.  మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్​ హీరోయిన్స్‌‌.  దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఇప్పటికే  ఫస్ట్ సాంగ్‌‌తో ఇంప్రెస్ చేశారు. గురువారం రెండో పాటను రిలీజ్ చేశారు.  భీమ్స్ సిసిరోలియో పాట కంపోజ్ చేయగా,  అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ రాశాడు.  భీమ్స్,  ప్రణవి ఆచార్య కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది. 

‘నా లైఫ్‌‌లో ఉన్న ఆ ప్రేమ పేజీని తీయనా.. పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా.. ట్రైనర్‌‌‌‌గా నేనుంటే ట్రైనీగా వచ్చిందా కూన.. వస్తూనే  వెలుగేదో నింపిందే ఆ కళ్లలోనా.. చిత్రంగా ఆ రూపం.. చూపుల్లో చిక్కిందే.. ఖాకీల తోటల్లో కోకిల్లే కూసాయే.. లాఠీల రెమ్మల్లో రోజాలే పూసాయే.. కలిసి తిరిగిన పార్కులు ఎన్నెన్నో.. కలిపిన మాటలు ఇంకెన్నో.. మాటలు కలిపే తొందరలోనే ప్రేమలు ముదిరాయే’  అంటూ సాగిన పాటలో  భార్య పాత్ర పోషించిన ఐశ్వర్య రాజేష్‌‌తో  తన ప్రేమ కథను వెంకటేష్ వివరిస్తున్నట్లు  చిత్రీకరించారు.

వెంకీ ప్రేయసిగా  మీనాక్షి చౌదరి కనిపించింది. ఇందులో వెంకటేష్ స్టైలిష్ కాప్ లుక్‌‌తో పాటు ఫ్యామిలీమేన్‌‌గా మెస్మరైజ్ చేయనున్నాడు.  ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్  ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా విడుదల కానుంది.