మజాకా సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్..

మజాకా సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్..

సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా  త్రినాధరావు నక్కిన  రూపొందించిన చిత్రం ‘మజాకా’. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌, ఫస్ట్ సాంగ్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం సెకండ్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ క్యాచీ లిరిక్స్‌‌ను అందించగా, లియోన్ జేమ్స్ కంపోజ్ చేయడంతో పాటు తనే స్వయంగా పాడాడు.  

‘హెడ్ లైట్ అయినా లేని చీకటి లైఫ్‌‌లోకి ఫ్లడ్ లైట్‌‌లా వచ్చావే బేబీ నువ్వే.. మట్టి రోడ్డు అయినా లేని ఊరిలోకి రింగు రోడ్డు వేసుకుని వచ్చావే బేబీ నువ్వే.. బేబీ మా బేబీ మా.. పక్కన వుండమ్మా.. ఇట్టా సెట్‌‌ అయిపోదామా.. బేబీ మా.. బేబీ మా.. లవ్వే లైఫ్ అందామా’ అంటూ సాగిన పాటలో  సందీప్ కిషన్ ప్రేమలో పడిన కథను బ్యూటీఫుల్‌‌గా చూపించారు. తనను పెళ్లి  చేసుకుంటే జీవితం ఎంత బాగుంటుందో హీరోయిన్‌‌కు వివరిస్తూ సాగిన పాట ఆకట్టుకుంది. 

సందీప్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌‌తో ఇంప్రెస్ చేశాడు.  రావు రమేష్, అన్షు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని   ఎకె ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌‌పై రాజేష్ దండా నిర్మించారు.  శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న సినిమా రిలీజ్ కానుంది.