![ఆపరేషన్ వాలెంటైన్ మూవీ నుంచి రెండో పాట విడుదల](https://static.v6velugu.com/uploads/2024/02/second-song-released-from-operation-valentine-movie_I7AaJ3TXMw.jpg)
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ హడా రూపొందిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగా, మంగళవారం రెండో పాటను విడుదల చేశారు.
ఇందులో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్‌గా కనిపిస్తున్న వరుణ్, మానుషి మధ్య కెమిస్ట్రీ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ట్యూన్‌కు ‘గగనాల తేలాను నీ ప్రేమలోనా... దిగిరాను ఎన్నేసి జన్మలైనా’ అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. అర్మాన్ మాలిక్ పాడిన విధానం ఇంప్రెస్ చేస్తోంది.
ALSO READ: ఓజీ మూవీ సెప్టెంబర్ 27న విడుదల
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘పాట కంటే సినిమా మరో స్థాయిలో ఉంటుంది. దేశాన్ని కాపాడే సైనికుల కోసం, వాళ్ళు చేసిన త్యాగాల కోసం, వాళ్ళ కథని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే గొప్ప ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. ఇది రియల్ సూపర్ హీరోస్ కథ’ అని చెప్పాడు. అందరూ గర్వపడే చిత్రమిది అని మానుషి చిల్లర్ అంది.