చెన్నై: తొలి టీ20లో చివరి వరకు పోరాడి ఓడిన ఇండియా విమెన్స్ టీమ్ రెండో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0–1తో వెనకబడ్డ టీమిండియా ఇందులో కచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే సిరీస్ చేజారుతుంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో దెబ్బకొట్టిన బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు.
వికెట్లు కాపాడుకోవడం, ఫీల్డింగ్‌ను మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మెడ నొప్పితో బాధపడుతున్న రిచా ఘోష్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. బ్యాటింగ్‌లో స్మృతి, హర్మన్, జెమీమా మెరవాలి. బౌలింగ్‌లో పూజ, రాధా కీలకం కానున్నారు. ఇక వన్డే సిరీస్, ఏకైక టెస్ట్‌ను చేజార్చుకున్న సౌతాఫ్రికా తొలి టీ20లో ఆడిన తీరు అద్భుతం. అదే జోరుతో ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.