
చట్టోగ్రామ్ (బంగ్లాదేశ్) : లాహిరు కుమార (4/50) నాలుగు వికెట్లతో సత్తా చాటడంతో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం ముగిసిన రెండో టెస్టులో లంక 192 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. 511 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 268/7తో చివరి రోజు ఆట కొనసాగించిన బంగ్లా 318 రన్స్‌కే ఆలౌటైంది.
మెహిదీ హసన్ మిరాజ్ (81 నాటౌట్) అజేయంగా నిలిచాడు. తైజుల్ ఇస్లాం (14), హసన్ మహ్మూద్ (6), ఖాలెద్ అహ్మద్ (2) నిరాశపరిచారు. కామిందు మెండిస్ మూడు, ప్రబాత్ జయసూర్య రెండు వికెట్లు పడగొట్టారు. కామిందు మెండిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.