
సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూకంపం వచ్చింది. 2024 ఫిబ్రవరి 06వ తేదీ మంగళవారం సాయంత్రం 7.26 గంటల సమయంలో ఐదు సెకన్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపిచింది. దీంతో స్థానికులు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
పది రోజుల వ్యవధిలో రెండు సార్లు భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఇంతకుముందు జనవరి 27వ తేదీన న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది.ఈ భూక్రంపనల వలన ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.