ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్ రెండో యూనిట్ జాతికి అంకితం

గోదావరిఖని, వెలుగు: తెలంగాణ పునర్విభజన చట్టం -2014లో భాగంగా నిర్మించిన రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్​లోని 800 మెగావాట్ల రెండో యూనిట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్​పద్ధతిలో జాతికి అంకితం చేశారు. గతేడాది అక్టోబర్​23న మొదటి యూనిట్​ను జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. అల్ట్రా సూపర్​క్రిటికల్​టెక్నాలజీతో ఈ యూనిట్లను నిర్మించారు. స్టేజ్​1లో భాగంగా నిర్మించిన 1,600 మెగావాట్ల విద్యుత్​లో 85 శాతం తెలంగాణ రాష్ట్ర అవసరాలకే వినియోగించనున్నారు. కాగా సోమవారం రామగుండం పర్మినెంట్​టౌన్ షిప్ లోని కాకతీయ ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేసిన స్క్రీన్ పై ఈ కార్యక్రమాన్ని తిలకించారు. కార్యక్రమంలో మున్సిపల్​కమిషనర్​చింతల శ్రీనివాస్, ఎన్ బీసీ మెంబర్​బాబర్​సలీంపాషా, కార్పొరేటర్​కొలిపాక సుజాత, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, బీఎంఎస్​లీడర్​వడ్డేపల్లి రాంచందర్, క్యాతం వెంకటరమణ, ఎన్టీపీసీ ఆఫీసర్లు పాల్గొన్నారు.