రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. శనివారం రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,187 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,27,278కి పెరిగింది. శనివారం ఒక్కరోజే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1,15,311 టెస్టులు చేసింది. వీటిలో మరో 3,753 రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా కారణంగా శనివారం మరో ఏడుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,759కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 13,366 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం అత్యధికంగా 551 మందికి కరోనా సోకింది. మేడ్చల్ మల్కాజ్ గిరిలో 333, రంగారెడ్డి 271, నిజామాబాద్ 251, నిర్మల్ 154, జగిత్యాలలో 134, కామారెడ్డి 113, సంగారెడ్డి 104, వరంగల్ అర్బన్ 98 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
కాగా.. రాష్ట్రంలో శనివారం నమోదైన కరోనా కేసులు.. ఫస్ట్ వేవ్‌లో నమోదైన అత్యధిక కేసులను క్రాస్ చేశాయి. ఫస్ట్ వేవ్‌లో గత ఏడాది ఆగస్టు 25న 3,018 కేసులు నమోదు కాగా.. సెకండ్ వేవ్‌లో శనివారం 3,187 కేసులు నమోదయ్యాయి.