హైదరాబాద్ ఐఐటీ స్టూడెంట్ మిస్సింగ్

సంగారెడ్డి: కందిలోని ఐఐటీ హైదరాబాద్ లో సెకండియర్ స్టూడెంట్​మిసయ్యాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వాటర్ ట్యాంక్ తండాకు చెందిన  కార్తీక్ (21) క్యాంపస్ నుంచి ఈనెల 17న బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో పేరెంట్స్ ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తుచేపట్టారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కార్తీక్ వైజాగ్​లో ఉన్నట్లు గుర్తించారు.  ప్రస్తుతం అతని ఆచూకీ ఇంకా తెలియరాలేదు.