మామూలుగా మనం దీపావళి పండగ వచ్చినప్పుడు మాత్రమే టపాకాయలను చూస్తూ ఉంటాము.అయితే అది మన చేతిలో పట్టేంత చిన్న టపాకాయలను చూస్తూనే ఉంటాం.మరి ఏకంగా 500 కేజీల పేలుడు పదార్థం ఉన్న బాంబును ఎప్పుడైనా చూశారా.? అంత పెద్ద బాంబు పేల్చడం లాంటి విషయాలను ఎప్పుడైనా విన్నారా…? అయితే తాజాగా 500 కేజీల పేలుడు పదార్థం ఉన్న ఓ బాంబును నిర్వీర్యం చేసేందుకు 13 వేల మందిని ఖాళీచేయించారు. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రయోగించిన ఒక బాంబు పేలకుండా అలాగే ఉండిపోయింది.అయితే బాంబు జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌లో దొరికింది. యుద్దం జరిగి 78 ఏళ్లయినా ఇంకా బాంబులు దొరుకుతున్నాయి.
ప్రపంచం ఏనాటికీ మర్చిపోలేని ఘోరమైన ఘట్టాల్లో రెండవ ప్రపంచ యుద్ధం ఒకటి. ఈ యుద్దం తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు సంబవించాయి.. కొన్ని ప్రదేశాలు దారుణంగా నాశనం అయ్యాయి. అయితే రెండవ ప్రపంచంలో అత్యంత తీవ్రమైన పేలుడు స్వభావం ఉన్న బాంబులను ప్రయోగించినట్లు చెతుంటారు. రెండవ ప్రపంచయుద్ధంలో తీవ్రపేలుడు స్వాభావం ఉన్న500 కేజీల బాంబును 78 సంవత్సరాల తరువాత జర్మనీలో కనుగొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును నిర్వీర్యం చేసేందుకు జర్మనీలో 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌లో సోమవారం ( ఆగస్టు 7) రాత్రి ఈ బాంబు లభ్యమైంది.500 కేజీల బరువున్న ఈ వైమానిక బాంబును కనుగొన్నారు. బాంబు లభించిన ప్రదేశం నుంచి 500 మీటర్ల పరిధిలో జనాలు తిరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజలు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న నగరం అనే రైల్వే స్టేషన్ ను మూసేశారు. పలు రైళ్ల దారి మళ్లించారు. ఈ బాంబును నిర్వీర్యం చేసేంతవవరకు హెలికాప్టర్లతో అధికారులు గస్తీ నిర్వహిస్తున్నారు.
2017 సెప్టెంబర్‌లో ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో కూడా రెండో ప్రపంచ యుద్ధం బాంబు ఒకటి లభించింది. దీంతో దాదాపు 70 వేల మంది ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. 2018 ఏప్రిల్‌లో జర్మనీ రాజధాని నగరం బెర్లిన్ ప్రధాన రైల్వే స్టేషన్‌ను కూడా ఇదేవిధంగా ఖాళీ చేయించారు. అప్పట్లో సరిగ్గా ఇలాగే 500 కేజీల బరువున్న బాంబును నిర్మాణ కార్మికులు కనుగొన్నారు. 2020లో, డార్ట్‌మండ్‌లో రెండు బాంబులను కనుగొని బాంబును డిఫ్యూజ్ చేశారు.
ALSO READ :భారీ వర్షాలు, వరదలపై హైకోర్టుకు ప్రభుత్వ రిపోర్ట్
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా దళాలు ఈ బాంబును జర్మనీపై వేసి ఉండొచ్చని భావిస్తున్నారు. నాజీలకు వ్యతిరేకంగా ఆనాటి మిత్ర రాజ్యాలు చేసిన బాంబు దాడుల్లో పేలకుండా మిగిలిపోయిన బాంబులతో జర్మనీ నిండిపోయింది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ పేలని బాంబులు ఉన్నాయి.