వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం హాలీడే మూడ్‌లో ఉన్నారు. భార్య రితికా సజ్దేతో కలిసి లగ్జరీ కారులో తిరుగుతూ ముంబై వీధుల్లో ప్రత్యక్షమవుతున్నారు. తాజాగా హిట్‌మ్యాన్ భార్య రితికాతో కలిసి ముంబైలోని ఓ స్టోర్‌కు వెళ్లారు. అతని రాకను గమనించిన అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడి.. కారు ముందు నిలబడి తెగ ఫోటోలు దిగారు. ఈ క్రమంలో అతని కారుకు సంబంధించిన ఓ సీక్రెట్ విషయం వెలుగులోకి వచ్చింది.
లంబోర్ఘినీ ఉరుస్
హిట్‌మ్యాన్ గతేడాది లగ్జరీ కార్ల సంస్థ లంబోర్ఘినీకి చెందిన 'ఉరుస్’ మోడల్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బ్లూ కలర్‌లో మెరిసిపోతున్న ఆ కారు ధర సుమారు రూ.4.18కోట్ల పైమాటే అని సమాచారం. 3,996 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్‌తో నడిచే ఆ కారులో రోహిత్, రితికా దంపతులు రయ్.. రయ్.. అని దూసుకుపోతున్నారు.
Rohit Sharma with his Lamborghini today ❤️?@ImRo45 pic.twitter.com/46BrlpKim6
— Rohit Sharma Trends™ (@TrendsRohit) August 9, 2023
సీక్రెట్ ఏంటంటే..?
రోహిత్ ఉరుస్ కారు నంబర్ MH 01 EB 0264. ఇక్కడ మీరు ఓ విషయాన్ని గమనించాలి. అదే కారు నంబర్ లో ఉన్న 264. ఫ్యాన్సీ నంబర్ కాదు కదా..? అందులో ఏముందంటారా..? కాస్త ఆగండి. ఇక్కడే అసలు మ్యాటర్ దాగుంది. రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక స్కోరు ఎంతో తెలుసా..? 264 పరుగులు. దాన్నే తన కారు నంబరుగా 0264గా తగిలించుకున్నారు హిట్‌మ్యాన్.
శ్రీలంకపై 264
నవంబర్ 13, 2014.. ఈ తేదీని మనమైన మరిచిపోవచ్చేమో కానీ, లంక ఆల్ రౌండర్ తిశారా పెరీరా మాత్రం మరిచిపోడు.ఎందుకంటే ఆ మ్యాచ్‌లో 4 పరుగుల వద్ద ఉన్నప్పుడు హిట్ మ్యాచ్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచిన మహానుభావుడు అతనే. ఈ మ్యాచ్‌లో 264 పరుగులు బాదిన హిట్‌మ్యాన్.. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఆ జ్ఞాపకాలనే రోహిత్ తన కారు నెంబర్ గా మార్చుకున్నారు.