ఇంజినీరింగ్ లేడీస్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరా : ఏపీ గుడ్లవల్లేరులో కలకలం

ఏపీ రాష్ట్రం గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. లేడీస్ హాస్టల్ లోని వాష్ రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. 300 వీడియోలు రికార్డ్ చేశారనే వార్త కలకలం రేపుతోంది. ఈ విషయం బయటకు రావటంతో.. లేడీస్ హాస్టల్ అమ్మాయిలు అందరూ ఆందోళనకు దిగారు. అర్థరాత్రి కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసుల ఎంట్రీతో విచారణ సీరియస్ గా సాగుతుంది.

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ వాష్ రూంలో అమర్చిన సీక్రెట్ కెమెరా 2024, ఆగస్ట్ 29వ తేదీ బయటపడింది. హాస్టల్ లోని ఓ అమ్మాయి ఈ పని చేసిందని.. మిగతా అమ్మాయిల వీడియోలను బాయిస్ హాస్టల్ లోని కుర్రోళ్లకు పంపించిందని.. ఆ వీడియోలను ఆ అమ్మాయి, ఆ అబ్బాయి కలిసి.. వీడియో ఇంత అని రేటు కట్టి అమ్మేశారనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. లేడీస్ హాస్టల్ లోని కొంత మంది అమ్మాయిలే సీక్రెట్ కెమెరా ఫిక్స్ చేసినట్లు స్టూడెంట్స్ చెబుతున్నారు. బాయ్స్ హాస్టల్ లోని స్టూడెంట్స్ సెల్ ఫోన్లలో అమ్మాయిల వీడియోలు ఉన్నాయనేది ఇప్పుడు కాలేజీలోని అమ్మాయిలు చెబుతున్న వెర్షన్. 

Also Read :- జగన్‌తోనే ఉన్నా.. ఎప్పటికీ ఉంటా

ఈ ఇష్యూతో కాలేజీలో అమ్మాయిలు అందరూ ఆందోళన చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై ఎలాంటి ప్రకటనలు చేయటం లేదు. మీడియాను కూడా అనుమతించటం లేదు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన అమ్మాయి ఓ రాజకీయ పార్టీకి చెందిన కీలక నేత కుమార్తె అనే ప్రచారం కూడా జరుగుతుంది. అంతేకాదు.. వాష్ రూంలో రికార్డ్ అయిన వీడియోల్లో కొంత మంది రాజకీయ నేతల పిల్లలు కూడా ఉన్నట్లు ఇప్పుడు ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీంతో ఈ వ్యవహారాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. 

ఓ వైపు హనీట్రాప్ తో డబ్బున్న పారిశ్రామికవేత్తలకు వల వేస్తూ.. డబ్బు దోచుకుంటున్నట్లు ముంబైలో కేసులు నమోదైన కాదంబరి జత్వానీ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న ఏపీ సర్కార్.. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో అమ్మాయిలకు చెందిన 300 వీడియోలపై ఇంకెలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి..