పక్కా ప్లాన్తోనే ట్రంప్ పై కాల్పులు.. మీటింగ్ కు ముందే బిల్డింగ్ పైకి

పక్కా ప్లాన్తోనే  ట్రంప్ పై కాల్పులు.. మీటింగ్ కు  ముందే బిల్డింగ్ పైకి

అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై అటాక్ తో అగ్రరాజ్యం ఉలిక్కి పడింది.  ఓ మాజీ అధ్యక్షుడి పైనే దుండగుడు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అంతా వణికిపోతున్నారు. మరోవైపు ట్రంప్ పై దాడి ఘటనకు భద్రతా వైఫల్యమే ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ట్రంప్ మీటింగ్ జరుగుతున్న ప్రాంతంలోని ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైనుంచే దుండగుడు కాల్పులు జరిపినట్టు అధికారులు గుర్తించారు. కేవలం 137మీటర్ల దూరంలో ఉన్న బిల్డింగ్ పై నుంచే అటాక్ జరిగినట్లు తెలుస్తోంది.  మీటింగ్ కు 2, 3 గంటల ముందే ఓ వ్యక్తి బిల్డింగ్ పైకి ఎక్కినట్టు స్థానికులు చెప్తున్నారు.  అతడి చేతిలో గన్ కూడా ఉందని అంటున్నారు.  దాడికి పాల్పడిన వ్యక్తి థామస్ మ్యాథ్యూ క్రూక్ గా గుర్తించారు. అతడి వయుసు దాదాపు 20ఏళ్లు. మరో వైపు దీనికి ఎత్తైన ఎత్తులో నుంచి సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్నిప్పర్ అతడిని కాల్చి చంపారు.

 ప్రెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా.. ట్రంప్ పైకి గన్ తో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైంది. దీంతో అతడిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఘటనలో క్యాంపెయిన్ లో పాల్గొన్న ఓ వ్యక్తి చనిపోయాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు కాల్పులు జరిపిన వ్యక్తిని చంపేశాయి. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు.