సెక్రటేరియెట్​ను పేల్చేస్తానంటూ మూడ్రోజులుగా కాల్స్

సెక్రటేరియెట్​ను పేల్చేస్తానంటూ మూడ్రోజులుగా కాల్స్
  • లంగర్​హౌజ్​కు చెందిన యువకుడు అరెస్ట్

బషీర్ బాగ్, వెలుగు: ట్యాంక్​బండ్​వద్ద ఉన్న రాష్ట్ర సచివాలయాన్ని బాంబ్​తో పేల్చేస్తానంటూ మూడు రోజులుగా ఫోన్​కాల్స్​చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్​చేశారు. సెక్రటేరియెట్​ఎస్పీఎఫ్​ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన సైఫాబాద్ పోలీసులు మంగళవారం లంగర్ హౌజ్‌‌కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సిమ్ కార్డులు మారుస్తూ సెక్రెటేరియెట్ కు కాల్స్ చేస్తున్నట్లు గుర్తించారు. దర్గాకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదని, విసుగు చెంది బాంబ్​బెదిరింపు కాల్స్​చేసినట్లు సయ్యద్ మీర్ మహ్మద్ అలీ ఒప్పుకున్నాడు. పోలీసులు అతన్ని రిమాండుకు తరలించారు.