తీర్పు వచ్చిన గంటకే తాళం

తీర్పు వచ్చిన గంటకే తాళం

త్వరలోనే బిల్డింగ్స్ కూల్చివేత
మీడియా రూం, ఐటీ డిపార్ట్మెంట్ ఖాళీ
కూల్చివేత లేట్ కావొద్దని సీఎం ఆదేశం?
రూ. 800 కోట్ల అంచనాతో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం
ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేయాలని ప్లాన్

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్ బిల్డింగ్స్ ను త్వరలో కూల్చివేసేందుకు ప్లాన్ రెడీ అవుతోంది. ఇంప్లోజివ్ టెక్నాలజీతో బిల్డింగ్స్ ను నేలమట్టం చేసే ప్రక్రియ వైపు ఆఫీసర్లు మొగ్గుచూపుతున్నారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలిచే చాన్స్ ఉంది. సెక్రటేరియట్ వ్యవహారం కేసులో సోమవారం హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో సీఎం కేసీఆర్ సీనియర్ ఆఫీసర్లతో ఫోన్ మాట్లాడినట్టు తెలిసింది. బిల్డింగ్స్ కూల్చివేతను వెంటనే ప్రారంభించాలని, ఆలస్యం చేస్తే మరెవరైనా సుప్రీంకోర్టుకు వెళ్లే చాన్స్ ఉందని, ముందుగా బిల్డింగ్స్ కూల్చివేస్తే కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ఎలాంటి సమస్యలు రావని ఆయన అన్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి రూ. 800 కోట్లు!
కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం రూ. 800 కోట్లు ఖర్చయ్యే చాన్స్ ఉందని ఆఫీసర్లు ఓ అంచనా వేశారు. ఇప్పుడున్న సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చివేత ప్రక్రియ ప్రారంభం కాగానే.. కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచే చాన్స్ ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఏడాదిలోపే నిర్మాణం పూర్తికావొచ్చని అంటున్నారు. 10 కంపెనీల నుంచి కొత్త సెక్రటేరియట్ డిజైన్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. త్వరలో సీఎం వద్ద జరిగే సమీక్ష సమావేశంలో ఫైనల్ డిజైన్ ఖరారు కానుంది. 9 అంతస్తుల్లో 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెక్రటేరియట్ నిర్మించేందుకు గతంలో నిర్ణయించారు. సీఎం, మంత్రులు తమ చాంబర్లకు వెళ్లేందుకు విడివిడిగా ఎంట్రన్స్ లు, లిప్టులు ఏర్పాటు చేయనున్నారు. వాస్తు మేరకు సెక్రటేరియట్ ను నిర్మించేందుకుగాను పక్కనే ఉన్న విద్యుత్ సంస్థల ఆధీనంలోని రాక్ బిల్డింగ్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో 20 ఎకరాల విస్తీర్ణంలో న్యూసెక్రటేరియట్ కు కావాల్సిన బిల్డింగ్స్, పార్కింగ్, సువిశాలమైన పార్కు, ఫౌంటెన్, సర్వమత ప్రార్థన మందిరాలు నిర్మించనున్నారు.

అలా తీర్పు.. ఇలా తాళం
సెక్రటేరియట్ వ్యవహారంపై సోమవారం హైకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన పది నిమిషాల్లోనే ప్రగతిభవన్ నుంచి సీనియర్ ఆఫీసర్లకు ఆదేశాలు అందాయి. సెక్రటేరియట్లో మిగిలి ఉన్న మీడియా రూం, ఐటీ డిపార్ట్మెంట్ను ఖాళీ చేసి, తాళం వేయాలని ఆర్డర్స్ వచ్చాయి. దీంతో హడావుడిగా జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఐటీ సెక్రటరీ జయశ్ రంజన్ సెక్రటేరియట్ కు వెళ్లి అక్కడి ఐటీ విభాగాన్ని ఖాళీ చేయించారు. మీడియా రూమ్ ను కూడా క్లోజ్ చేశారు. వెంటనే ప్రధాన గేటుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తాళం వేశారు. సెక్రటేరియట్ ను కూల్చి, కొత్త సెక్రటేరియట్ ను నిర్మించాలని ఏడాది క్రితం ప్రభుత్వం నిర్ణయించినప్పుడే అందులోని చాలా డిపార్ట్మెంట్లను ఖాళీ చేయించి ఎదురుగా ఉన్న బీఆర్కే భవన్కు, మరికొన్నింటిని ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేశారు.

For More News..

లాక్డౌన్ భయంతో హైదరాబాద్‌ వదిలేసి ఊర్లకు పోతున్నజనం

కాంగ్రెస్ర్ ర్యాలీలో బెదిరిన ఎడ్లు