అవినీతి చేప: ఏసీబీ వలలో సెక్రటేరియట్ఆఫీసర్

అవినీతి చేప: ఏసీబీ వలలో సెక్రటేరియట్ఆఫీసర్
  • లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సివిల్ సప్లయ్స్ సెక్షన్ ఆఫీసర్

హైదరాబాద్‌‌, వెలుగు: సెక్రటేరియట్​లోని సివిల్ సప్లయ్‌‌ డిపార్ట్‌‌మెంట్​సెక్షన్ ఆఫీసర్‌‌‌‌ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఒక ఉద్యోగి తన పెన్షనరీ బెన్‌‌ఫిట్స్‌‌ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నాడు.

ఆ ఫైల్ సచివాలయంలోని సివిల్ సప్లయ్స్‌‌ కన్స్యూమర్ అఫైర్స్‌‌సెక్షన్ ఆఫీసర్‌‌‌‌ విక్రమ్ అలెగ్జాండర్‌‌‌‌ వద్ద పెండింగ్‌‌లో ఉంది. ఈ ఫైల్‌‌ ముందుకు వెళ్లాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్‌‌ చేశాడు. దీంతో బాధితుడు హైదరాబాద్ సిటీ రేంజ్‌‌1 ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 

సచివాలయం బయట ఉన్న టీ స్టాల్‌‌ వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు.