ఇండ్ల దరఖాస్తులకు డబ్బులు తీసుకున్నరు..కార్యదర్శి, కారోబార్ పై దరఖాస్తుదారుల ఫిర్యాదు

ఇండ్ల దరఖాస్తులకు డబ్బులు తీసుకున్నరు..కార్యదర్శి, కారోబార్ పై దరఖాస్తుదారుల ఫిర్యాదు
  •  రోడ్డుపై బైఠాయించి బాధితుల ఆందోళన 
  • జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో ఘటన

జగిత్యాల రూరల్ వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు దారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో బుధవారం గ్రామ సభ నిర్వహించారు.  సుమారు 521 దరఖాస్తుదారుల నుంచి రూ. 500 చొప్పున గ్రామ కార్యదర్శి, కారోబార్ వసూలు చేసినట్టు బాధితులు ఆరోపించారు. అనంతరం  రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇండ్ల  ఆన్ లైన్ పై మండల ప్రత్యేక అధికారి నరేశ్ ​దృష్టికి తీసుకువెళ్లారు.  బాధితులంతా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు దరఖాస్తుదారులు తెలిపారు.

కార్యదర్శి సస్పెన్షన్ కు కలెక్టర్ ఆదేశాలు 

మోరపల్లిలో ఇండ్ల దరఖాస్తుదారుల నుంచి సెక్రటరీ , కారోబార్‌‌ డబ్బులు వసూలు చేశారని దరఖాస్తుదారుల ఫిర్యాదుపై మండల ప్రత్యేకాధికారి నరేశ్‌ విచారణ చేశారు. అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్ కు నివేదిక అందజేశారు.  సెక్రటరీ రాజిరెడ్డిని సస్పెండ్ చేయాలని, కారోబార్ శ్రవణ్ కుమార్‌‌ను విధుల నుంచి తొలగించాలని అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డికి  ఆదేశాలు 
జారీచేశారు.