టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ ‌‌ ‌‌కు సహాయ నిరాకరణ : జనక్ ‌‌ ‌‌ ప్రసాద్

గోదావరిఖని, వెలుగు : ఐఎన్ ‌‌ ‌‌టీయూసీ కోటాలో వచ్చే ఎన్నికల్లో రామగుండం కాంగ్రెస్​టికెట్​తనకు ఇవ్వకపోతే ఆ పార్టీకి సహకరించేది లేదని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ ‌‌ ‌‌ జనక్ ‌‌ ‌‌ ప్రసాద్ ‌‌ ‌‌ హెచ్చరించారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్ ‌‌ ‌‌క్లబ్ ‌‌ ‌‌తో పాటు జీడీకే 2వ గనిపై జరిగిన మీటింగ్ ‌‌ ‌‌లో సీనియర్ ‌‌ ‌‌ వైస్ ‌‌ ‌‌ ప్రెసిడెంట్ ‌‌ ‌‌ గుమ్మడి కుమారస్వామితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఐఎన్ ‌‌ ‌‌టీయూసీ నేతకు టికెట్​ఇస్తే రామగుండంలో కాంగ్రెస్​గెలుస్తుందన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్ ‌‌ ‌‌ కార్మికులకు చేసిందేమీ లేదన్నారు. 2015లో పార్లమెంట్ ‌‌లో ఎంఎండీఆర్ ‌‌ ‌‌ బిల్లుకు మద్దతు తెలిపిన బీఆర్ ‌‌ఎస్ ‌‌ ‌‌ ఎంపీలు ఇప్పుడు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తునట్లు నటిస్తున్నారన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్నారు. మీటింగ్ ‌‌ ‌‌లో లీడర్లు ఎస్ ‌‌.నర్సింహారెడ్డి, లక్ష్మీపతిగౌడ్ ‌‌ ‌‌, పి.ధర్మపురి, కె.సదానందం, డి.రాజేందర్ ‌‌ ‌‌, శ్రీనివాస్ ‌‌ ‌‌, పాల్గొన్నారు.