కేసీఆర్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి యం. పద్మనాభరెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో దళితబంధు పథకం అమలులో పలుచోట్ల చాలా అవకతవకలు జరుగుతున్నాయని తరచూ న్యూస్ పేపర్లలో వార్తలు వస్తున్నాయని యం. పద్మనాభరెడ్డి తన లేఖలో వివరించారు. వాసాలమర్రి గ్రామంలో తాము దళితబంధుపై సర్వే నిర్వహించామని, అయితే..ఏడాదిన్నర గడిచినా అనుకున్న లక్ష్యాలు చేరలేదన్నారు. 

దళితబంధు పథకం నిర్వహణలో అవినీతి జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను యం. పద్మనాభరెడ్డి కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తలకే దళితబంధు పరిమితమవుతుందన్న అనుమానం ప్రజల్లో నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.