- మూడో రోజు 144 సెక్షన్
జైనూర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో 144 సెక్షన్కొనసాగుతోంది. మండల కేంద్రంలో ఈనెల 13న రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కారణంగా పోలీసులు 144 సెక్షన్విధించారు. మూడో రోజు కొనసాగిన బంద్ తో జైనూర్ నిర్మానుష్యంగా మారింది. 200 మంది ప్రత్యేక పోలీస్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్కెట్ లోని హోటళ్లు, కిరాణా దుకాణాలను మూసివేశారు. సరుకుల కోసం పల్లెల నుంచి వచ్చిన వారికి ఇబ్బందులు తప్పడంలేదు.