విగ్రహ ఏర్పాటులో వివాదం.. బోధన్ లో హై టెన్షన్

నిజామాబాద్ జిల్లా బోధన్ లో శివాజీ విగ్రహా ఏర్పాటు.. రెండు వర్గాల మధ్య వివాదానికి దారి తీసింది. విగ్రహ ఏర్పాటుపై ఓ వర్గం అభ్యంతరం తెలుపగా.. మరో వర్గం విగ్రహం పెడుతామని చెప్పడంతో గొడవకు దారి తీసింది. బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో ఇరు వర్గాల రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులపై కూడా ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు.  దీంతో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు సీపీ నాగరాజు. బోధన్ పట్టణంలో పికెటింగ్ కొనసాగుతుందన్నారు. గొడవకు కారణమైన రెండువర్గాలపై కేసులు పెట్టామన్నారు. పలువురి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు సీపీ.