ఇంటింటికీ ఓటర్ స్లిప్పులు అందజేయాలి : సెక్టోరియల్ అధికారులు

బాల్కొండ, వెలుగు: ఈ నెల 16 నుంచి 19 వరకు ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్ స్లిప్పులు అందజేయాలని సెక్టోరియల్ అధికారులు సూచించారు. బుధవారం బాల్కొండ ఎంపీడీవో ఆఫీస్​లో బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్లకు వారు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సెక్టోరియల్​అధికారులు మాట్లాడుతూ.. ఎన్నికలు పారదర్శంగా జరిగేలా చూడాలన్నారు.

కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర్, నాయబ్ తహసీల్దార్ వినోద్, సెక్టోరియల్ ఆఫీసర్లు సంతోష్ కుమార్, మాధవి పాల్గొన్నారు.