
హైదరాబాద్ సిటీ, వెలుగు: సికింద్రాబాద్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కుషాయిగూడలో శుక్రవారం ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. దాదాపు 300 మంది ఈ క్యాంపులో పాల్గొని వైద్యసేవలు పొందారు. కార్యక్రమానికి జిల్లా చైర్‌పర్సన్ మురిడాల్ మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అధ్యక్షుడు మనోజ్ కుమార్, - ఉపాధ్యక్షుడు హనుమత రోవా, - కార్యదర్శి సిరిపాద, కోశాధికారి బార్ఘవ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ లయన్ క్లబ్ ఆధ్వర్యంలో 11 ఏండ్లుగా అనేక సామాజిక కార్యకలాపాలను చేపడుతున్నామన్నారు. తమ సేవలు అందించేందుకు మద్దతు ఇచ్చిన వెంకటేశ్వర ఆలయ సంస్థ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.