6.5 కిలోల వెండి నగలు మాయం!

గణపతి దేవాలయ అర్చకుడి సస్పెన్షన్

సికింద్రాబాద్, వెలుగు :  సికింద్రాబాద్ గణపతి దేవాలయ అర్చకుడు మురళీ కృష్ణపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ  ఈవో వినోద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14 , 15 తేదీల్లో జేఈవో అంజనాదేవి ఆధ్వర్యంలో దేవాలయంలో ఆభరణాల అప్రైజింగ్ జరిగింది. దేవాలయంలో అందరు అర్చకుల వద్ద వాడుకలో ఉన్నవి, వాడుకలో లేని ఆభరణాలను అప్రైజ్ చేశారు. అయితే ఆ ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ గుడిలో అర్చకుడిగా పనిచేసే మురళీ కృష్ణ..  ఆయన వద్ద ఉన్న 6.5 కేజీల 9 వెండి ఆభరణాలు అధికారుల ముందుకు తీసుకురాలేదు.

లాకర్​లో ఉన్నాయని తాళం చెవిలు పోయాయని మురళీకృష్ణ అధికారులకు చెప్పాడు. దీంతో అదే రోజు ఆయనకు ఈవో వినోద్ మెమో జారీ చేశారు. 15 రోజులు గడిచినా మురరళీకృష్ణ ఎలాంటి సంజాయిషీ ఇవ్వలేదు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అర్చకుడు వచ్చి చూపించే వరకు ఆభరణాలు మాయమయ్యాయని చెప్పలేమని ఈవో వివరణ ఇచ్చారు.