- జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌కు టెండర్లు పిలిచిన కంటోన్మెంట్ బోర్డు
- ముందుకురాని కాంట్రాక్టర్లు
కంటోన్మెంట్, వెలుగు : సికింద్రాబాద్ జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వద్ద వెహికల్స్ పార్కింగ్ కోసం కంటోన్మెంట్ బోర్డు స్థలాన్ని కేటాయించి టెండర్లను పిలిచినా ఒక్కరు కూడా ఆసక్తి చూపలేదు. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ మెట్రోస్టేషన్ చాలా బిజీగా ఉండే ప్రాంతం. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు తమ వెహికల్స్‌ను స్టేషన్‌సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్‌స్థలంలో పెట్టుకుంటారు. చుట్టూ రేకులతో మూసి ఉండే ఈ పార్కింగ్ స్థలం వాహనాల రద్దీతో సరిపోవడం లేదు.
దీంతో పాటు ఆలస్యమైతే పార్కింగ్‌కు గేట్లు మూసేస్తున్నారు. ఈ కారణాల వల్ల చాలామంది తమ వెహికల్స్‌ను సమీపంలోని జేబీఎస్బస్స్టేషన్లోని పార్కింగ్ ప్లేస్‌లో పార్క్చేస్తున్నారు. ప్రస్తుతం డిఫెన్స్ ల్యాండ్‌లో పార్కింగ్ కొనసాగుతుండగా.. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న గణేశ్
టెంపుల్ పక్కన స్థలాన్ని పార్కింగ్ కోసం లీజుకు ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. దీని కోసం 1,735 చదరపు గజాల స్థలాన్ని కేటాయించి ఇటీవల ఆన్‌లైన్‌లో టెండర్లను పిలిచారు. అయితే టెండర్‌లో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం నిబంధనలే కారణమని అంటున్నారు.
నిబంధనలే అడ్డొస్తున్నాయా?
నూతన టెండర్ ప్రక్రియలో విధించిన నిబంధనలతోనే బిడ్డర్లు ఎవరూ ఇంట్రస్ట్ చూపించడం లేదు. బోర్డు అధికారులు కేటాయించిన 1735 చదరపు గజాల స్థలం పూర్తిగా చెత్తా చెదారం, రాళ్లురప్పలు, ఎత్తు వంపులతో ఉంది. టెండర్లు వేసి కాంట్రాక్టు దక్కించుకున్న వారే ఈ స్థలాన్ని చదును చేసుకోవాలని, అందులో అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే లైసెన్సు మాత్రం కేవలం ఏడాది వరకే అని గడువు విధించారు. దీంతో టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు ఏడాది తర్వాత ఖాళీ చేసి బోర్డు వేసే టెండరు ప్రక్రియలో తిరిగి పాల్గొనాలని నిబంధనలు విధించారు.
ఈ రూల్స్ వల్ల టెండర్లు వేసి కాంట్రాక్టు దక్కించుకున్న తర్వాత ఈ స్థలంలో ఉన్న ఆక్రమణలు తొలగించి స్థలాన్ని చదును చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇంత వ్యయప్రసాలకు ఓర్చి టెండర్లు దక్కించుకున్నా.. ఏడాది కాలంలో పార్కింగ్ వల్ల వచ్చే ఆదాయం అంతా పెట్టుబడికి పోయేలా ఉందని ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. స్థలాన్ని చదును చేసి అందులో అవసరమైన మేరకు సదుపాయాలు బోర్డు కల్పిస్తే టెండర్లు వేసేందుకు సిద్దమని కొందరు కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.