డిసెంబర్ 9 నుంచి ముత్యాలమ్మ గుడిలో ప్రాణప్రతిష్ఠ

డిసెంబర్ 9 నుంచి  ముత్యాలమ్మ గుడిలో ప్రాణప్రతిష్ఠ

సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్​కుమ్మరిగూడలోని ముత్యాలమ్మగుడిలో అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇటీవల ఓ దుండగుడు అమ్మవారి  విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో దేవాదాయ శాఖ నుంచి రూ.30 లక్షలు మంజూరు చేశారు. ఆలయ అభివృద్ధితో పాటు అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. సోమవారం నుంచి 11వ తేదీ వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తునట్టు చెప్పారు. బుధవారం 8.33 గంటలకు విగ్రహ పున:ప్రతిష్ఠ ఉంటుంది.