
గుండెపోటుతో కానిస్టేబుల్ కార్తీక్(25) మృతి చెందాడు. సికింద్రాబాద్ లోని మార్కెట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కార్తీక్ కు గుంటూరు బాపట్లలో స్వగృహంలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.
వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కార్తీక్ 2020లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.