- లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీస్కోండి
బషీర్ బాగ్, వెలుగు: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఇటీవల పోలీసులు చేసిన లాఠీచార్జ్‌లో గాయపడిన వారు తమకు న్యాయం చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. అకారణంగా తమపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితులు వెంకటేశ్, సాయి ఫిర్యాదు చేశారు. అమ్మవారి విగ్రహంపై దాడి జరిగిందని తెలిసి, ఆలయం వద్ద శాంతియుతంగా నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నామని చెప్పారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా దాడిచేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందు దేవుళ్లపై దాడులు జరుగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.