సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో ఆదివారం బస్తీవాసులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా తొట్టెల ఊరేగింపుతో పాటు ఫలహార బండి ఉరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, కార్పొరేటర్ కొంతం దీపిక పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ ఉన్నా మజ్లిస్, ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.