ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం కేసు నిందితుడికి రిమాండ్​

  • ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ముంబై నుంచి వచ్చి గుడిపై దాడి
  • ఇస్లాం మతబోధకుల వల్ల ఇతర మతాల పట్ల ద్వేషం 
  • గతంలో శివుడి విగ్రహం కూడా ధ్వంసం చేసినట్లు నిర్ధారణ
  • కేసు వివరాలు వెల్లడించిన సీసీఎస్​ ఏసీపీ విజయ సారథి

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్​కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన కేసులో నిందితుడు అల్మాన్​సలీమ్​థాకూర్​ను సీసీఎస్​ పోలీసులు శనివారం రిమాండ్​చేశారు. ఈ మేరకు సీసీఎస్​ఏసీపీ విజయ సారథి  వివరాలు వెల్లడించారు. ముంబైలోని ముంబ్రాకు చెందిన సల్మాన్​(30) కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. స్పోకెన్​ఇంగ్లీష్​, పర్సనాలిటీ డెవెలప్​మెంట్ కోర్సుల్లో శిక్షణ పొందేందుకు అక్టోబర్ 1న నగరానికి వచ్చాడు.  

సికింద్రాబాద్​మెట్రోపోలీస్​హోటల్​బిల్డింగులో  మోటివేషనల్ స్పీకర్​మునావర్ జమా నిర్వహిస్తున్న ఇంగ్లిష్ హౌస్​​అకాడమిలో చేరాడు. అదే హోటల్​లో బుక్​ చేసిన హోటల్​రూమ్​లో బస చేశాడు. అక్టోబరు 14న ఉదయం 4.30 గంటల సమయంలో  సికింద్రాబాద్ పాస్​పోర్టు కార్యాలయానికి ఎదురుగా ఉన్న కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ గుడికి వెళ్లాడు. ఆలయ గేటు తాళాలు పగులగొట్టి గుడిలోకి ప్రవేశించాడు. ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా..స్థానికులు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని నిమ్స్​ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించారు. 

ఆరోగ్యం కుదుటపడటంతో అదుపులోకి..

ముత్యాలమ్మ గుడి ఘటనలో గాయపడిన సల్మాన్​అప్పటి నుంచి అస్పత్రిలోనే ఉన్నాడు. అతని ఆరోగ్యం మెరుగుపడటంతో సీసీఎస్ పోలీసులు శనివారం ఆసుపత్రి నుంచి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుడికి కోర్టు 14 రోజులు రిమాండ్​ విధించడంతో పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు.. ఈ కేసును సిట్(ఎస్ఐటీ)కి బదిలీ చేశారు. అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించిన విచారణ సీసీఎస్​పోలీసులే కొనసాగిస్తున్నారు. 

గతంలోనూ ఆలయాలపై దాడి

సల్మాన్.. ఉద్దేశపూర్వకంగానే  గుడిలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అతనికి గతంలో  నేరచరిత్ర ఉన్నట్లు దర్యాప్తులో  గుర్తించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సల్మాన్..​ ఫేస్ బుక్, యూట్యూబ్ లల్లో ఇస్లాం మతబోధకుడు జాకీర్ నాయక్, ఇతర ఇస్లాం మతబోధకుల వీడియోలు చూసేవాడన్నారు. దానివల్ల ఇతర మతాల పట్ల అతను ద్వేషాన్ని పెంచుకున్నట్లు తేలింది. 

హిందూ దేవతల విగ్రహాలపై తీవ్రమైన ద్వేషాన్నిపెంచుకున్నట్లు గుర్తించారు. 2022 అక్టోబర్ 6న ముంబై ఆరేసబ్ ప్రాంతంలో చెప్పులతో గణేష్ మండపంలోకి ప్రవేశించాడు. విగ్రహారాధన ఆచారాన్ని అపహాస్యం చేస్తూ స్థానిక వ్యక్తులతో గొడవపడ్డాడు. అలాగే.. 2024 ఆగస్టు 1న మహారాష్ర్ట మీరాభయందర్ ఏరియాలోని మనోకామన సిద్ధిమహాదేవ మందిర్ లోకి చొరబడి.. శివుడి విగ్రహాన్ని తన కాళ్లతో తొక్కి ధ్వంసం చేశాడు. దీంతో అతనిపై వేరువేరు చోట్ల రెండు కేసులు నమోదయ్యాయి. 

వదంతులు నమ్మొద్దు: సీసీఎస్​ ఏసీపీ విజయ సారథి 

నగరంలో శాంతి భద్రతలు పట్ల కొంత మంది చేస్తున్న వదంతులు నమ్మవద్దని సీసీఎస్​ఏసీపీ విజయసారథి కోరారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని, అన్ని  విధాలుగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.  నేరాలను అదుపు చేయడంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని రిక్వెస్ట్ చేశారు.