సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో దుండగుడు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఈ టాపింక్ సంచలనంగా మారింది. ధ్వంసమైన ముత్యాలమ్మ తల్లి విగ్రహం ఉన్న ఆలయంలో అక్టోబర్ 17న ( గురువారం) శాంతి, చండీ హోమం పూర్ణాహుతి జరిపించారు. పూజలు జరుగుతున్న సమయంలో ఆలయంలోకి ఓ మహిళా అఘోరి (నాగసాధు) వచ్చింది. భక్తులు అందరూ ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు అమ్మవారే వచ్చిందాని భక్తులు నమ్ముతూ నీళ్లు సాక పోశారు. ఆలయానికి వచ్చిన అఘోరీ హోమంలో పాల్గొని, ఒంటి కాలుపై నిలబడి పూజలు చేశారు.
ALSO READ | హైదరాబాద్ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల దగ్గర కేజిన్నర గంజాయి