సికింద్రాబాద్: అమ్మవారి విగ్రహం ధ్వంసం..సీసీ ఫుటేజ్

సికింద్రాబాద్: అమ్మవారి విగ్రహం ధ్వంసం..సీసీ ఫుటేజ్

సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాం ధ్వంసం కేసులో  ఒక నిందితుడిని పోలీసులు  అరెస్ట్ చేశారు.  సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఆలయం తలుపులు తన్నుతున్నట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది.  ముగ్గురు నిందితుల్లో ఒకరిని  స్థానికులు చితకబాదారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పరారైన మిగతా వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
 
 అక్టోబర్ 14న  ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.   గర్భగుడి నుంచి విగ్రహాన్ని బయట విసిరేశారు.  హిందూ సంఘాలు, స్థానికులు భారీగా చేరుకుని ఆలయం ముందు ఆందోళనకు దిగారు.  ఈ ఆందోళనలో స్థానిక బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక పాల్గొన్నారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో   పోలీసులు భారీగా మోహరించారు. నార్త్ జోన్ డీసీపీ సాదాన రష్మి పెరుమాళ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.   కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని, కంటోన్మెంట్ ఎమ్మెల్యే  శ్రీ గణేష్  ఆలయంలోపలికి వెళ్లి పరిశీలించారు. 

ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆలయంలో విగ్రహం ధ్వంసం చేసిన నిందితులు సిసీ ఫుటేజ్ లో కనిపించారని చెప్పారు.  నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.