సికింద్రాబాద్ పీజీ కాలేజీలో కుళ్లిపోయిన ఆహారం.. విద్యార్థుల ఆందోళన

సికింద్రాబాద్ పీజీ కాలేజీలో కుళ్లిపోయిన ఆహారాన్ని పెడుతున్నారంటూ ఆందోళనకు దిగారు విద్యార్థులు.పుడ్ బాగాలేదంటూ కాలేజీ హాస్టల్ ముందు కూర్చొని నిరసన చేపట్టారు విద్యార్థులు. ఎన్ని సార్లు పిర్యాదు చేసినా హాస్టల్ సిబ్బంది పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.

కుళ్లిపోయిన ఫుడ్ తినడం వల్ల పలువురికి ఫుడ్ పాయిజన్ అయ్యిందని, కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. యాజమాన్యం ఇంట్లో కూడా పిల్లలకు ఇలాంటి ఆహారమే పెడతారా అంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ALSO READ : సూర్యాపేట జిల్లాలో విచ్చలవిడిగా కల్తీ ఆహారం

పరిస్థితిని వార్డెన్ దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోకపోగా ఏం చేసుకుంటారో చేసుకోండి... అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. కుళ్లిపోయిన ఆహారం తిని స్టూడెంట్స్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లినా కూడా యాజమాన్యం పట్టించుకునే స్థితిలో లేకపోవటం సిగ్గు చేటని  అంటున్నారు విద్యార్థులు.