- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి స్మగ్లర్ అరెస్టు
- 18 కిలోల సరుకు సీజ్
సికింద్రాబాద్, వెలుగు: ఒడిశా నుంచి గుజరాత్‌కు గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర స్మగ్లర్‌ను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని పూల్బనీ జిల్లా దనాపూర్‌కు చెందిన సుదర్శన్ నాహక్(54) అదే ప్రాంతంలో టీ- కొట్టు నడుపుతున్నాడు.
ఈజీ మనీ కోసం ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి, హైదరాబాద్ మీదుగా గుజరాత్ సూరత్ తరలించి అమ్ముతున్నాడు. గురువారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ నం.2లో అతను అనుమానాస్పదంగా కనిపించగా, పోలీసులు తనిఖీ చేశారు.
అతని బ్యాగులో రూ.4.61 లక్షల విలువైన18.450 కిలోల గంజాయి గుర్తించి సీజ్ చేశారు. నిందితుడిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు సికింద్రా బాద్ రైల్వే డీఎస్సీ జావేద్ తెలిపారు.
జూబ్లీహిల్స్‌లో మరో 8 కిలోలు..
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్10లో 8.60 కేజీల గంజాయి పట్టుబడింది. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై మూడో వ్యక్తికి శుక్రవారం గంజాయిని ఇవ్వడానికి వెళ్తుండగా, పక్కా సమాచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులను చామన్ కుమార్ (బీహార్), సాయినాథ్ (హఫీజ్‌పేట్) గా గుర్తించి, ఒక బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు బీహా ర్కు చెందిన రోహన్ కుమార్ పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమలా సన్ రెడ్డి తెలిపారు.