సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌కు అవార్డు

సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌కు అవార్డు

మాదాపూర్, వెలుగు: సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌కు ప్లాటినం రేటింగ్‌‌ అవార్డు దక్కింది. గ్రీన్‌‌ రైల్వే స్టేషన్ల రేటింగ్‌‌ సిస్టంలో దేశంలోనే సికింద్రాబాద్‌‌ స్టేషన్‌‌కు ఈ అవార్డు వచ్చిందని సికింద్రాబాద్‌‌ డివిజనల్‌‌ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా తెలిపారు. అంతర్జాతీయ గ్రీన్ బిల్డింగ్ వీక్ ​2022 సందర్భంగా గురువారం హైదరాబాద్‌‌లోని మాదాపూర్‌‌‌‌లో కాన్ఫెడరేషన్‌‌ ఆఫ్ ఇండియన్‌‌ ఇండస్ట్రీస్‌‌ (సీఐఐ) సెంటర్‌‌‌‌లో ఇండియన్‌‌ గ్రీన్‌‌ బిల్డింగ్‌‌ కౌన్సిల్‌‌ (ఐజీబీసీ) హైదరాబాద్ చాప్టర్​ ఆధ్వర్యంలో గ్రీన్‌‌ క్రూసెడర్స్‌‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో సీఐఐ, ఐజీబీసీ సంయుక్తంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌కు ప్లాటినం రేటింగ్‌‌ అవార్డు అందించాయి. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ.. సికింద్రాబాద్ స్టేషన్‌‌కు ప్లాటినం రేటింగ్‌‌ రావడం ఆనందంగా ఉందన్నారు.