
- 100 రోజుల వరకు మూసివేత
- స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా నిర్ణయం
- చర్లపల్లి, కాచిగూడ, మల్కాజిగిరి, నాంపల్లి నుంచి బయల్దేరనున్న రైళ్లు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టేషన్‌లోని ఆరు ఫ్లాట్‌ఫాంలను 100 రోజుల పాటు మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ పనుల కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా కొన్ని రైళ్లను పలు స్టేషన్లకు తరలించారు. సికింద్రాబాద్–విజయవాడ మధ్య నడిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి కాచిగూడ స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, సికింద్రాబాద్–పోరుబందర్ మధ్యనడిచే పోరుబందర్ఎక్స్ ప్రెస్ కూడా కాచిగూడ నుంచి రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్– సిద్దిపేటకు నడిచే సిద్దిపేట డీఎంయూ ఇక నుంచి మల్కాజిగిరి స్టేషన్ నుంచి బయల్దేరుతుంది.
సికింద్రాబాద్–పూణె మధ్య నడిచే పూణె ఎక్స్‌ప్రెస్ నాంపల్లి స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్–మణుగూరు మధ్య నడిచే సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ఇక చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. సికింద్రాబాద్–రేపల్లె మధ్య నడిచే సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. సిల్చార్–సికింద్రాబాద్ మధ్య నడిచే సిల్చార్ ఎక్స్‌ప్రెస్ తాజాగా చర్లపల్లి నుంచి రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్–దర్భంగా మీదుగా నడిచే సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి చర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది.
సికింద్రాబాద్–యశ్వంత్‌పూర్ మధ్య నడిచే సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి రాకపోకలు సాగిస్తుంది. తిరుపతి–ఆదిలాబాద్ మధ్యనడిచే తిరుపతి ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి మీదుగా నడుస్తుందని అధికారులు తెలిపారు. లింగంపల్లి– కాకినాడ మీదుగా నడిచే లింగంపల్లి ఎక్స్ ప్రెస్ చర్లపల్లి, అమ్ముగూడ మీదుగా రాకపోవకలు సాగిస్తుందని వెల్లడించారు. కాజిపేట–హడాప్సర్ మీదుగా నడిచే కాజిపేట ఎక్స్ ప్రెస్ చర్లపల్లి, అమ్ముగూడ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. లింగంపల్లి–విశాఖపట్నం మధ్య నడిచే లింగంపల్లి ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి, అమ్ముగూడ మీదుగా ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్–కర్నూల్ మధ్య నడిచే తుంగభద్ర ఎక్స్ ప్రెస్.. కాచిగూడ నుంచి ప్రారంభమవుతుందని వివరించారు.