గుడ్ న్యూస్: ఇక 5 రోజుల్లోనే పాస్​పోర్ట్

గుడ్ న్యూస్:  ఇక 5 రోజుల్లోనే పాస్​పోర్ట్
  • తత్కాల్​ ఒక్క రోజులోనే ఇస్తం: రీజినల్​ పాస్ పోర్ట్ సెంటర్ ​డైరెక్టర్​ స్నేహజ
     
  • 2024లో 7.85 లక్షల పాస్ పోర్టులు జారీ చేశామని వెల్లడి
  • 2024 వార్షిక నివేదిక విడుదల

సికింద్రాబాద్, వెలుగు: ఇక నుంచి దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే పాస్ పోర్ట్​ జారీ చేస్తామని సికింద్రాబాద్​ రీజినల్​ పాస్ పోర్ట్ సెంటర్ ​డైరెక్టర్​స్నేహజ తెలిపారు. తత్కాల్​ పాస్ పోర్ట్  ఒక్క రోజులోనే అందిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం రీజినల్​పాస్​పోర్ట్ ఆఫీసులో 2024 యాన్యువల్ ​రిపోర్టును ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాస్​పోర్టు జారీలో రీజినల్ పాస్​పోర్టు సెంటర్ విశేష పురోభివృద్ధిని సాధించిందన్నారు. గతేడాది 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 7.85లక్షల మందికి పాస్​పోర్టులు జారీ చేశామన్నారు. ప్రస్తుతం రీజినల్ ​పాస్​పోర్టు ఆఫీసు పరిధిలో ఐదు పాస్​పోర్ట్ ​సేవా కేంద్రాలు,14 పోస్ట్​ఆఫీస్ పాస్​పోర్టు సేవా కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపారు.  

ALSO  READ : చైనా మాంజా అమ్మితే..ఐదేండ్లు జైలు..లక్ష జరిమానా

గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 కేంద్రాల్లో ప్రతిరోజూ సరాసరిగా 4,200 దరఖాస్తులు వచ్చాయన్నారు. మొత్తం 7.85 లక్షల మందికి పాస్​పోర్టులు జారీ చేశామని, మిగతా వాటిని సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో పెండింగ్​ పెట్టామన్నారు. వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్​ కు అనుగుణంగా వరంగల్, ఖమ్మం, వికారాబాద్, మేడ్చల్, మహబూబాబాద్, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్​ పీఎస్​కేలలో అపాయింట్​మెంట్ల సంఖ్యను పెంచామని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం  పాస్​పోర్టుకు  పోలీసు ఎంక్వైరీకూడా ఆన్​లైన్​లో  కొనసాగుతుందని తెలిపారు. వినియోగదారులకు పాస్​పోర్టు సేవలు మరింత చేరువ చేసేందుకు కొత్తగా మొబైల్​ పాస్​పోర్టు సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. అలాగే, దరఖాస్తు దారులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేకంగా  8121401532 నంబరుతో వాట్సాప్​ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ నంబరుకు  వాట్సాప్​తో తమకు ఫిర్యాదు చేస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.