వందే భారత్ రైలు బోగీలు డబుల్

  • సంక్రాంతి రద్దీ నేపథ్యంలో రైల్వే అధికారుల నిర్ణయం
  • సికింద్రాబాద్-విశాఖపట్నం ట్రైన్​కు 8 అదనపు కోచ్​లు
  • ఈ నెల 13 నుంచి 16 కోచ్​లతో నడవనున్న ట్రైన్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: సంక్రాంతి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రోజూ నడిచే వందేభారత్​ఎక్స్​ప్రెస్(20707/20708) బోగీలు పెంచాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఈ ట్రైన్​8 బోగీలతో నడుస్తోంది. ఈ నెల 13 నుంచి మరో 8 బోగీలతో కలిపి మొత్తం 16 బోగీలతో ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. రోజూ 8 బోగీల్లో(1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్​కార్ కోచ్​లు) 530 మంది ప్యాసింజర్లు జర్నీ చేస్తున్నారు.

తాజా నిర్ణయంతో ఆ సంఖ్య 1,128కు చేరనుంది. ఇక నుంచి 14 చైర్​కార్​కోచ్​లలో 1,024 మంది, రెండు ఎగ్జిక్యూటివ్​కోచ్​లలో 104 మంది జర్నీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు 7 చైర్​కార్​లలో 478 మంది, ఒక ఎగ్జిక్యూటివ్​కోచ్​లో 52 జర్నీ చేశారు. గతేడాది ఏప్రిల్ లో మొదలైన ఈ ట్రైన్​కు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అధికారులు తెలిపారు.