సికింద్రాబాబాద్ –​ దానాపూర్ ​రైలు రద్దు

సికింద్రాబాబాద్ –​ దానాపూర్ ​రైలు రద్దు

హైదరాబాద్​సిటీ, వెలుగు: సికింద్రాబాద్– దానాపూర్, దానాపూర్– సికింద్రాబాద్ వెళ్లే ప్యాసింజర్ రైళ్ల రాకపోకలను రెండ్రోజుల పాటు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆపరేషనల్ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ నెల 19న సికింద్రాబాద్ నుంచి వెళ్లే సికింద్రాబాద్– దానాపూర్ రైలును రద్దు చేశామని అధికారులు చెప్పారు. ఈ నెల21న దానాపూర్ నుంచి సికింద్రాబాద్ కు బయల్దేరే దానాపూర్– సికింద్రాబాద్ రైలును కూడా రద్దు చేశామని వివరించారు.