ఫిన్‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్ల కోసం గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ తెస్తామన్న సెబీ

ఫిన్‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్ల కోసం గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ తెస్తామన్న సెబీ
  •   ఒక పోస్టుకి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షలు సంపాదిస్తున్న ఫిన్‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్లు

  •   కొంత మంది ఇన్వెస్టర్లను మానిప్యులేట్ చేసేందుకే స్టాక్ రికమండేషన్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: టెలిగ్రామ్‌‌‌‌‌‌‌‌, వాట్సాప్, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌, యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ల ద్వారా స్టాక్ టిప్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చే వారి కోసం గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ తీసుకురావాలని సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌ అండ్ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)  చూస్తోంది. సెబీ దగ్గర రిజిస్టర్ కాకుండానే చాలా మంది వివిధ సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా స్టాక్ టిప్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు. ఫైనాన్షియల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్ల కోసం గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ తెచ్చేందుకు పనిచేస్తున్నామని సెబీ హోల్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ మెంబర్ ఎస్‌‌‌‌‌‌‌‌కే మహంతి అన్నారు. ముంబైలో క్రోల్‌‌‌‌‌‌‌‌-–సీఐఐ నిర్వహించిన నేషనల్ కాన్ఫెరెన్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న ఆయన సైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌లో ఈ విషయం చెప్పారు.  కేవలం సెబీ దగ్గర రిజిస్టర్ కాని వారే కాకుండా సోషల్ మీడియాలో పెద్ద మొత్తంలో ఫాలో వర్లు ఉన్నవారు కూడా స్టాక్స్‌‌‌‌‌‌‌‌ను రికమండ్ చేస్తున్నారు. వీరు తమకున్న ఫాలోవర్లను బట్టి పోస్టుకి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకుంటున్నారని తెలిసింది. బాగా పాపులర్ అయిన వారు నిర్ధిష్టమైన కంపెనీల గురించి వివరించడానికి సపరేట్‌‌‌‌‌‌‌‌గా వీడియోలు చేస్తున్నారు.  పోస్టుకి రూ. 12 లక్షల వరకు కూడా డిమాండ్ చేస్తున్నారు.

మరికొందరైతే ఎటువంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోయినప్పటికీ స్టాక్స్‌‌‌‌‌‌‌‌ను ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని   కంపెనీలు వీరిని అప్రోచ్ అయ్యి తమ షేర్లను ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఇలా సోషల్ మీడియాలో స్టాక్  టిప్స్ ఇచ్చేవారిని ‘ఫిన్‌‌‌‌‌‌‌‌ప్లూయెన్సర్స్‌‌‌‌‌‌‌‌’ గా పిలుస్తున్నారు. కాగా, స్టాక్ టిప్స్ ఇవ్వాలంటే ఫైనాన్షియల్ అడ్వైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సెబీ దగ్గర రిజిస్టర్ కావాలి. ప్రస్తుతం 1,300 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. ఫైనాన్షియల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్లు పెరగడం  ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతోంది. క్లిష్టమైన ఫైనాన్షియల్ జార్గాన్‌‌‌‌‌‌‌‌ను సింపుల్‌‌‌‌‌‌‌‌గా వివరించగలగడంతో  వీరికి ఆదరణ పెరుగుతోంది. 2021–22 లో  ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌, క్రిప్టో కరెన్సీ కంటెంట్‌‌‌‌‌‌‌‌కు  సంబంధించి  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రెటీలు 415 సార్లు రూల్స్‌‌‌‌‌‌‌‌ను అతిక్రమించినట్టు  సెబీ గుర్తించింది.  

సులువైన పరిష్కారం లేదు..

ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్లను కట్టడి చేయడంపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ ప్రకటిస్తామని ఈ రెగ్యులేటరీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ మాధవి పూరి బచ్ సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30 న పేర్కొన్నారు. ఈ సమస్యను  విడతల వారీగా  పరిష్కరిస్తామని చెప్పారు.  ‘ఈ సమస్య ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. అయినప్పటికీ ఈ సమస్య తీవ్రతను బట్టి ఫిన్‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్ల కోసం గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ తీసుకురావడంపై ఇండస్ట్రీ వర్గాలతో చర్చలు జరుపుతున్నాం. దీనికి కొంత టైమ్‌‌‌‌‌‌‌‌ పడుతుంది.  సులువైన పరిష్కారం దరిదాపుల్లో కనిపించడం లేదు’ అని ఆమె అప్పుడు పేర్కొన్నారు. ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్లను డిఫైన్ చేయడం ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌తో కూడుకున్నదని వివరించారు. కాగా, స్టాక్‌‌‌‌‌‌‌‌ టిప్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి ఇన్వెస్టర్లను మానిప్యులేట్ చేసిన ఏడుగురిని ఈ ఏడాది మార్చి 10 న సెబీ పట్టుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్, భావ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ (గుజరాత్‌‌‌‌‌‌‌‌), నీమూచ్‌‌‌‌‌‌‌‌ (మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌), న్యూఢిల్లీ, ముంబైలలో  వీరికి  చెందిన ఆఫీసులు, ఇండ్లలో సోదాలు నిర్వహించింది.

‘నిర్ధిష్టమైన కంపెనీల షేర్లను సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లు, వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ల ద్వారా రికమండ్ చేయడం పెరిగిందని సెబీకి ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ వచ్చింది’ అని ఈ సోదాలపై సెబీ వివరణ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో కూడా ఇన్వెస్టర్లను మానిప్యులేట్ చేస్తూ అక్రమంగా ప్రాఫిట్స్‌‌‌‌‌‌‌‌ పొందుతున్న ఆరుగురిని మార్కెట్ రెగ్యులేటరీ గుర్తించింది.  మార్కెట్‌‌‌‌‌‌‌‌లో  ఎంటర్ కాకుండా వీరిపై బ్యాన్ విధించింది. అలానే రూ.2.84 కోట్ల పెనాల్టీ వేసింది. సెబీ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం, ఈ ఆరుగురు  చిన్న కంపెనీల షేర్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, ఆ తర్వాత వివిధ సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ల ద్వారా  ఈ షేర్లను ప్రమోట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఈ కంపెనీ షేర్లు భారీ లాభాలిస్తాయని  ఇన్వెస్టర్లను మానిప్యులేట్ చేశారు. ఇతర ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనేలా చేశారు. మరోవైపు క్రిప్టో కరెన్సీలను అడ్వర్టయిజ్‌‌‌‌‌‌‌‌ చేసే సెలబ్రెటీలను సెబీ ఇప్పటికే గుర్తించింది. వీరు క్రిప్టోలు ప్రమోట్‌ చేయకుండా ఆపింది.