
మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా భద్రతా బలగాలకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇతడు దక్షిణ బస్తర్ పరిధిలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన వ్యక్తి. బస్తర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన ఏకైక ఆదివాసీ నేత. భారీ ఆయుధాలు కలిగిన 350 మంది సభ్యుల మావోయిస్టుల బెటాలియన్ 1కి హిడ్మా కమాండర్‌గా ఉన్నాడు.
ఇతడు ఎక్కడుంటే అక్కడ.. ఆయనకు మూడంచెల భద్రత కోసం వందల మంది మావోయిస్టులు ఉంటారు. కర్రె గుట్టల్లో హిడ్మా బెటాలియన్ దాక్కుందనే పక్కా సమాచారంతోనే భద్రతా బలగాలుఇక్కడపోలీస్‌ఆపరేషన్‌స్టార్ట్ చేశాయి. కాగా, భద్రతా దళాలకు చిక్కకుండా తప్పించుకోవడంలో హిడ్మా నేర్పరి. దండకారణ్యం మొత్తం అతనికి కొట్టిన పిండి. అనేక ఎన్‌కౌంటర్ల నుంచి హిడ్మా త్రుటిలో తప్పించుకున్నాడు. కానీ ఈసారి ఎలాగైనా పట్టుకోవాలనే లక్ష్యంతో భద్రతా బలగాలు కర్రె గుట్టల చుట్టూ నలువైపులా మోహరించాయి.