భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రంపై భద్రతా బలగాలు సోమవారం మెరుపుదాడి చేశాయి. తెర్రెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోమటిపల్లి అడవుల్లో సీఆర్‌పీఎఫ్, డీఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టుల ఆయుధాల తయారీ స్థావరాన్ని గుర్తించాయి.
బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు స్థావరం వదిలేసి పారిపోయారు. బలగాలు మావోయిస్టు స్థావరం వద్దకు చేరుకొని ఆయుధాల తయారీకి ఉపయోగించే పరికరాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.