
ఆపరేషన్ కగార్ లో భాగంగా కీలకమైన కర్రెటుట్ట ను స్వాధీనం చేసుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఏడు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 28న భద్రతా బలగాలు బీర్ బాటిల్ బాంబును, దానికి అమర్చిన వైరును కనుకొన్నాయి.
కర్రెగుట్ట కొండలు 290 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. ఇది అనేక చిన్న కొండల శ్రేణి. కర్రెగుట్ట కొండలు ఛత్తీస్గఢ్, మహారా ష్ట్ర, తెలంగాణ అంతటా విస్తరించి ఉన్నాయి. ఛత్తీస్ ఘడ్ లోనే ఇది కాంకేర్ నుంచి బీజాపూర్ వరకు వ్యాపించి ఉంది. ఇక్కడ హిడ్మా, దేవాలాంటి నాయకులు షెల్టర్ ఏర్పర్చుకొని ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఈ నక్సల్ ఆపరేషన్లో, ఒక వైపు సైనికులు నక్సలైట్లతో పోరాడుతుండగా, మరోవైపు అనేక మంది భద్రతా దళాల సిబ్బంది మం దుపాతరలను తొలగించే పనిలో ఉన్నారు. సైనికులను లక్ష్యంగా చేసుకుని నక్సలైట్లు 100 కి పైగా ఐఇడిలను అమర్చారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా భద్రతా దళాలు డ్రోన్ల సహాయంతో కర్రెగుట్ట పై నిఘా ఉంచాయి. ఆపరేషన్ లో భాగంగా ఇవాళ అడవిలోని చదును చేయని రోడ్డు నుంచి సైనికులు ఒక బీర్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. బస్తర్ గార్డ్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ గార్డ్స్ సైనికులు భూమి లోపల పాతిపెట్టిన బీర్ బాంబులను బయటకు తీస్తున్న వీడియో బయటపడింది. బాంబు పేల్చేందుకు ఏర్పాటు చేసిన వైర్ ను కూడా సైనికులు స్వాధీనం చేసుకున్నారు.