మావోయిస్ట్‌‌ డంప్‌‌ సీజ్.. భారీగా కంటి పరీక్షలకు సంబంధించిన పరికరాలు

మావోయిస్ట్‌‌ డంప్‌‌ సీజ్.. భారీగా కంటి పరీక్షలకు సంబంధించిన పరికరాలు

భద్రాచలం, వెలుగు: చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా చింతల్‌‌నార్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలో మావోయిస్ట్‌‌ల డంప్‌‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గోమగూడ బేస్‌‌ క్యాంప్‌‌ సమీపంలోని అడవుల్లో బుధవారం భద్రతాబలగాలు కూంబింగ్‌‌ చేపట్టాయి. 

ఈ క్రమంలో విప్లవసాహిత్యం, కీలక డాక్యుమెంట్లతో పాటు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఉపయోగపడే ఐఓఎల్‌‌ మాస్టర్‌‌ ఆప్టోమీటర్‌‌, లెన్స్‌‌ కిట్‌‌, బీపీ ఆపరేటర్లు, స్టెతస్కోప్‌‌లు సైతం దొరకడంతో భద్రతాబలగాలు అవాక్కయ్యాయి. 

ఇటీవల వరుస ఎన్‌‌కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. అయితే దృష్టిలోపం కారణంగానే మావోయిస్టులు భద్రతాబలగాలకు చిక్కుతున్నారని భావించి వారికి కంటి పరీక్షలు చేపడుతున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.