జల్లేరుగూడ అడవుల్లో మావోయిస్ట్‌‌ డంప్‌‌

జల్లేరుగూడ అడవుల్లో మావోయిస్ట్‌‌ డంప్‌‌

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా చింతల్‌‌నార్‌‌ పీఎస్‌‌ పరిధిలో మావోయిస్ట్‌‌ల డంప్‌‌ను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గోమగూడ బేస్‌‌ క్యాంప్‌‌ సమీపంలోని జల్లేరుగూడ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం రావడంతో సీఆర్‌‌పీఎఫ్‌‌, కోబ్రా బలగాలు ఆదివారం కూంబింగ్‌‌కు వెళ్లాయి. పోలీసుల రాకను పసిగట్టిన మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు.

కూంబింగ్‌‌కు వెళ్లిన భద్రతాబలగాలకు లేజర్‌‌ ప్రింటర్, ఇన్వర్టర్‌‌, కేబుల్స్‌‌, వైర్లు, కాలిక్యులేటర్‌‌, రిమోట్, పేలుడు పదార్ధాలతో పాటు ఇతర సామగ్రి కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకుని గోమగూడ బేస్‌‌ క్యాంప్‌‌నకు తరలించారు.