
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెట్టగూడెం అడవుల్లో మావోయిస్టుల డంప్‌ను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సీఆర్‌పీఎఫ్ కోబ్రా, 131 బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఆదివారం మెట్టగూడెం అడవుల్లో కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో డంప్ కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. డంప్‌లో మావోయిస్టుల విప్లవ సాహిత్యంతో పాటు పేలుడు పదార్థాలు, డ్రోన్లు, రైఫిల్స్, బీజీఎల్ లాంచర్ల సామగ్రి, భారీ మొత్తంలో నిత్యావసరాలు దొరికినట్లు భద్రతాబలగాలు తెలిపాయి.
లొంగిపోయిన తొమ్మిది మంది మావోయిస్టులు
ఏటూరునాగారం: మావోయిస్టు పార్టీకి చెందిన 9 మంది ఏటూరునాగారంలో ములుగు ఓఎస్డీ మహేశ్ గీతే సమక్షంలో ఆదివారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కాంచల మిలీషియా కమాండర్ మడకం ఉంగ, ఊడమల్ల గ్రామానికి చెందిన మడకం ఇడ్మి, ఉడుతమల్లకు చెందిన పోడియం కోస, సోడి జోగి, కుంజం ఐతే, సోడి బుద్ర, కుంజం కోస, పొడియం ఐతే, కుంజం కోస ఉన్నట్లు ఓఎస్టీ తెలిపారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్39 బెటాలియన్ కమాండెంట్ సతీశ్‌కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు తాజొద్దీన్, టీవీఆర్ సూరి ఉన్నారు.