రష్యాలో పోలీసులను బంధించిన ఖైదీలు.. కాల్చి చంపేసిన సెక్యూరిటీ ఫోర్సెస్

మాస్కో: రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్​లో ఉన్న ఖైదీలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని బెదిరింపులకు దిగారు. దీంతో ఎంటరైన రష్యన్ దళాలు ఎన్​కౌంటర్ చేసి ఖైదీల్లో కొంతమందిని మట్టుబెట్టాయి. మృతులు ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థ(ఐఎస్) సానుభూతిపరులని, అందుకే కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. రోస్టోవ్​ఆన్​డాన్​లోని ప్రీ ట్రయల్ డిటెన్షన్ సెంటర్​లో ఆరుగురు ఖైదీలు కలిసి ఇద్దరు గార్డులను బంధించారు.

కత్తులు, గొడ్డలి చూపించి బెదిరించారు. సమాచారం అందుకున్న సెక్యూరిటీ ఫోర్సెస్.. స్పాట్​కు చేరుకుని ఖైదీలను కాల్చి చంపేశాయి. అయితే, ఖైదీల్లో కొందరికి ఐఎస్​తో సంబంధాలున్నాయని పోలీసులు మీడియాకు తెలిపారు. సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, సేఫ్​గా ఉన్నారని చెప్పారు. ఎంతమంది ఖైదీలను చంపేసింది మాత్రం వెల్లడించలేదు. కాగా, కొద్దిరోజులుగా ఐఎస్ టెర్రరిస్టులు రష్యాపై దాడులకు దిగుతున్నారు. మూడు నెలల కిందే మాస్కోలో ఓ కాన్సెర్ట్​ జరుగుతుండగా కాల్పులు జరిపి 145 మందిని పొట్టనపెట్టుకున్నారు.