ఒడిశా: ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో పేషంట్ కు అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డు ఇంజెక్షన్ చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. స్థానికంగా నివసించే ఒక వ్యక్తి చిన్న ప్రమాదానికి గురయ్యాడు. దాంతో వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. ఆ సమయంలో ఆస్పత్రిలో వైద్యుడు, నర్స్ లేదా పారామెడికల్ సిబ్బంది ఎవరూ లేరు. దాంతో అక్కడే సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి సదరు పేషంట్ కు ఇంజెక్షన్ చేశాడు. ఈ సంఘటనను బాధితుడి బంధువు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దాంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఘటన జరిగిన సమయంలో ఆస్పత్రిలో డాక్టర్, నర్సు, లేదా పారామెడికల్ సిబ్బంది ఎవరూ ఎందుకు లేరని అసిస్టెంట్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ మానస్ రంజన్ బిస్వాల్ ను అడిగితే.. ఘటనపై విచారణ ప్రారంభించామని.. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆ సమయంలో ఇంచార్జీగా ఎవరు ఉన్నారో తెలుసుకొని విషయం తెలుసుకుంటామని ఆయన చెప్పారు.
[VIDEO]
— OTV (@otvnews) September 9, 2021
Viral Video | Security guard administers injection to patient in #Odisha hospital
LINK - https://t.co/CHhRTid36o pic.twitter.com/50OSicPgO8