హ్యాకర్ల ఆటలు సాగవు : గూగుల్‌ కొత్త ఫీచర్

హ్యాకర్ల ఆటలు సాగవు : గూగుల్‌ కొత్త ఫీచర్

హ్యాకర్ల ఫిషింగ్‌ దాడులను తిప్పి కొట్టడానికి గూగుల్ త్వరలోనే ఓ కొత్త ఫీచర్‌ ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆండ్రాయిడ్ ఫోన్లనే సెక్యూరిటీ ‘కీ’ తరహాలో వాడుకునేలా ఈ ఫీచర్‌ ఉంటుంది. ఇది ‘టు-స్టెప్ వెరిఫికేషన్‌ ’లాంటిదన్నమాట. ఈ ఫీచర్‌ ను ఆన్ చేసుకుంటే చాలు.. ఏ గూగుల్  సర్వీస్‌ లోకి యూజర్ లాగిన్ అయినా యూజర్ ఆండ్రాయిడ్ ఫోన్‌ కు నోటిఫికేషన్ వెళ్తుంది. దాన్ని ‘ఓకే’ చేస్తేనే ఆ గూగుల్ సర్వీస్‌ లోకి లాగిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ ను వాడుకోవాలంటే యూజర్‌ ఆండ్రాయిడ్ ఫోన్‌ లో ఓఎస్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్‌ కన్నా పై వెర్షన్ ఉండాలి.

యూజర్ ఫోన్‌ తోపాటు లాగిన్ అవ్వాలనుకున్న డివైస్‌ లో బ్లూ టూత్ ఆన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గూగుల్ ఎకౌంట్‌ కు ఆండ్రాయిడ్ ఫోన్ యాడ్ చేయాలి. సెట్టింగ్స్‌‌లో టు స్టెప్ వెరిఫికేషన్‌ ను ఆన్ చేస్తే ఓ సెక్యూరిటీ ‘కీ’ ఆటోమేటిక్‌ గా క్రియేట్ అవుతుంది. అప్పుడే యూజర్ తనకున్న ఆండ్రాయిడ్ డివైస్‌ లలో సెక్యూరిటీ కీ కావాలనుకున్న ఏదైనా ఒక డివైస్‌ ను యాడ్ చేస్తే చాలు. దాంతో ఆ డివైస్.. కీలా పనిచేస్తుంది. దీంతో ఇకపై యూజర్‌ కు ఉన్న గూగుల్ అకౌంట్‌ లోకి లాగిన్ అయినప్పుడల్లా ఆ డివైస్‌ కు మెసేజ్ వస్తుంది. అప్పుడు దాన్ని ఓకే చేస్తేనే గూగుల్ అకౌంట్‌ లోకి లాగిన్  అయ్యేందుకు అవకాశం ఉంటుంది.