రెచ్చిపోతున్న హ్యాకర్లు : 8వేల వెబ్ సైట్స్ డేటా చోరీ

రెచ్చిపోతున్న హ్యాకర్లు : 8వేల వెబ్ సైట్స్ డేటా చోరీ

తెలుగు రాష్ట్రాలపై ఆన్ లైన్ హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్ సైట్లపై కన్నేశారు. ఈ డిస్కంలకు చెందిన వెబ్ సైట్లను హ్యాక్ చేశారు. ర్యాన్ సమ్ వేర్ వైరస్ తో సర్వర్లలో ఉన్న డేటాను చోరీ చేశారు. ఆ తర్వాత సర్వర్లలో ఉన్న డేటాను పూర్తిగా డిలీట్ చేశారు. చోరీ చేసిన డేటాను తిరిగిచేందుకు 35 కోట్లకు పైగా డబ్బులు ఇవ్వాలంటూ.. అధికారులకు మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ డిస్కంలకు సంబంధించిన సర్వర్లకు బ్యాకప్ ఉండటంతో డేటా భద్రత సమస్య తప్పిందంటున్నారు.

హ్యాకర్లు టీసీస్ కంపెనీ నిర్వహిస్తున్న పలు సంస్థల వెబ్ సైట్లపై కన్నేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని 4 డిస్కంలతో పాటు ఓ ఎయిర్ లైన్స్ అధికారిక వెబ్ సైట్ ను సైతం హ్యాకింగ్ కు పాల్పడినట్లు కూడా తెలుస్తోంది.

గతంలోనూ ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాక్ చేశారు. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్, కేంద్ర హోంశాఖ వెబ్ సైట్ ను కూడా హ్యాక్ చేశారు. దేశ వ్యాప్తంగా గత మూడేళ్లలో 8వేలకు పైగా వెబ్ సైట్లు హ్యాక్ కు గురైనట్లు తెలుస్తోంది.  చోరీ చేసిన డేటాను రిలీజ్ చేయాలంటే కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు హ్యాక్లర్లు.